Posts

First Love Of Ninth Class | Telugu Story

  అవి తొమ్మిదో తరగతి మొదలయిన రోజులు. ప్రేమ అంటే, పూర్తిగా అర్ధం కూడా తెలియని వయసు. ఆటపాటలతో, ఆనందంతో సాగుతున్న ప్రయానం లో ప్రేమ అనే పదం తొలిగా పరిచయం అవుతుంది. ఇక నా కధ చెప్పాలి అంటే, ప్రేమ కే కాదు అసల సున్నితమైన మాటలకి కూడా చోటు లేని జీవితం. ఏం చెప్పినా కఠినంగానే చెప్పటం. ప్రతీ విషయానికీ ఆలోచన లేకుండా అరిచెయ్యటం. అదీ, మా స్కూల్ లో నేనంటే తెలియని వారే లేరు. కొందరు ఇష్టంతో, కొందరు అవసరం తో, కొందరు పగతో, కొందరు స్నేహం తో ఇలా ఏదోరకంగా నన్నైతే గుర్తుపెట్టుకున్నారు. ఇక ఈ కధ చెప్పటానికి అసలు కారనం, మద్యాహ్నం మొదలైంది. దిక్కులు చూస్కుంటూ, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, భోజనం చేస్తున్నాం స్నేహితులందరం. ఇంతలో నా చూపు, ఎవర్నో వెతుక్కుంటూ కిటికీ వైపు తిరిగాయ్. అక్కడ ఉన్నది ఎవరో తెలియదు. ఎవరికోసమో కూడా తెలియదు. ఇంతలో ఒక మనిషి. ముఖం కూడా పూర్తిగా కనిపించటం లేదు వెలుతురు ఎక్కువ ఉండటం వల్ల. చూస్తుంటే, ఏదో ధీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుగా ఉన్నారు. కానీ ఆ ఆలోచనలో ఒక బాధ కానిపిస్తుంది. దగ్గరకి వెళ్ళి అడగలేం. సందేశం కూడా పంపలేం, ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో అని. ఇక ఆశక్తి మాని కిటికీ దగ్గర కోతి అని బయటకి వచ్చేసా