First Love Of Ninth Class | Telugu Story

 

అవి తొమ్మిదో తరగతి మొదలయిన రోజులు. ప్రేమ అంటే, పూర్తిగా అర్ధం కూడా తెలియని వయసు. ఆటపాటలతో, ఆనందంతో సాగుతున్న ప్రయానం లో ప్రేమ అనే పదం తొలిగా పరిచయం అవుతుంది.
ఇక నా కధ చెప్పాలి అంటే, ప్రేమ కే కాదు అసల సున్నితమైన మాటలకి కూడా చోటు లేని జీవితం. ఏం చెప్పినా కఠినంగానే చెప్పటం. ప్రతీ విషయానికీ ఆలోచన లేకుండా అరిచెయ్యటం. అదీ, మా స్కూల్ లో నేనంటే తెలియని వారే లేరు. కొందరు ఇష్టంతో, కొందరు అవసరం తో, కొందరు పగతో, కొందరు స్నేహం తో ఇలా ఏదోరకంగా నన్నైతే గుర్తుపెట్టుకున్నారు.

ఇక ఈ కధ చెప్పటానికి అసలు కారనం, మద్యాహ్నం మొదలైంది. దిక్కులు చూస్కుంటూ, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, భోజనం చేస్తున్నాం స్నేహితులందరం. ఇంతలో నా చూపు, ఎవర్నో వెతుక్కుంటూ కిటికీ వైపు తిరిగాయ్. అక్కడ ఉన్నది ఎవరో తెలియదు. ఎవరికోసమో కూడా తెలియదు. ఇంతలో ఒక మనిషి. ముఖం కూడా పూర్తిగా కనిపించటం లేదు వెలుతురు ఎక్కువ ఉండటం వల్ల. చూస్తుంటే, ఏదో ధీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుగా ఉన్నారు. కానీ ఆ ఆలోచనలో ఒక బాధ కానిపిస్తుంది. దగ్గరకి వెళ్ళి అడగలేం. సందేశం కూడా పంపలేం, ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో అని. ఇక ఆశక్తి మాని కిటికీ దగ్గర కోతి అని బయటకి వచ్చేసా నా స్నేహితురాలితో కలిసి. తర్వాత అనిపించింది అసలు అనకుండా ఉండాల్సిందీ అనీ. ఎందుకంటే, ఇప్పటి వరకూ కాపాడుకుంటున్న పరువు పోయింది. ఎలా అనుకుంటున్నారా?

అసలు నేను అన్నా మాటలు ఎవరికీ వినిపించలా, ఒక అబ్బాయికి తప్ప. విన్నవాడు ఊరుకోవచ్చుగా వెళ్ళి ఆ కోతికి చెప్పేసాడు. ఇంకేముంది, నా కోసం వెయిటింగ్. ఎప్పుడు వస్తానా, ఎప్పుడు నిలదీద్దామా అని‌. ఇంక పరువు ఎక్కడ పోయిందీ అంటే, మామూలుగా నా తప్పు ఉన్నా ఎవరూ నన్ను ఏమీ అనకూడదు అనుకునే రకం నేను. కానీ నన్ను అందరి ముందూ తిడుతున్నా ఏమీ అనకుండా అలా నుంచుండిపోయా, ఆ క్షనం ఎంత కోపం వచ్చిందో, కానీ ఎందుకో ఏమీ అనలేకపోయా...
ఎందుకూ అనే ప్రశ్నకి రెండేళ్ళ తర్వాత తెల్సింది. తొలి ప్రేమ చెప్పి రాదు, వస్తే పోదు అని.


Comments